ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: CM YOGI సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: CM YOGI సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించవని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బీజేపీ సంకల్ప సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ , బీఎస్పీ అందరి ఎజెండా ఒక్కటే అని చెప్పారు. సొంత రాష్ట్రం అయిన యూపీలోనే బీఎస్పీకి కేవలం ఒక సీటు మాత్రమే ఉందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అయోధ్యలో రామ మందిరం నిర్మించి ఉండేదా? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో కాంగ్రెస్ వ్యాక్సిన్ ఇచ్చేది కాదని, దేశ ప్రజలందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదని, మోడీ ఫ్రీ రేషన్ కూడా ఇస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో బీజేపీతోనే అభివృద్ధి జరుగుతుందని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed