KCR రాజీనామా చేసేందుకే రేపు కేబినెట్ భేటీ: MP ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
KCR రాజీనామా చేసేందుకే రేపు కేబినెట్ భేటీ: MP ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని టీ-కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రైతుబంధు నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించేలా దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ శనివారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు సీఈవోను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఫలితాల వేళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని ఫిర్యాదు చేశామన్నారు. రైతుబంధు నిధులలో రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు దారి మళ్లిస్తున్నారని, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డులు మారుస్తున్నట్టు తమకు సమాచారం ఉందని ఇలా మొత్తం నాలుగు అంశాలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

మోడల్ కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వం చేస్తున్న విధాన పరమైన నిర్ణయాలపై నిఘా పెట్టాలని సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. అలాగే ఆదివారం గెలుపు ధృవపత్రాలు మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు తీసుకుంటారని ఆ మేరకు ఆర్వోలకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరామన్నారు. కేబినెట్ సమావేశం నిర్ణయంపై స్పందించిన ఉత్తమ్.. ఎల్లుండి కేసీఆర్ కేబినెట్ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయబోతున్నారో తెలియదని బహుశా తన రాజీనామాలు సమర్పించేందుకే ఈ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉండవచ్చన్నారు.

Next Story

Most Viewed