వీటన్నింటికి తెలంగాణే నిధులిచ్చిందా? కేటీఆర్‌కు ఎంపీ లక్ష్మన్ కౌంటర్

by Dishanational2 |
వీటన్నింటికి తెలంగాణే నిధులిచ్చిందా? కేటీఆర్‌కు ఎంపీ లక్ష్మన్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు కౌంటర్ ట్వీట్ చేశారు. అయితే, కేంద్ర పథకాలను టీఆర్ఎస్ అమలు చేస్తూ సొమ్ము ఒకరిది, సోకు టీఆర్ఎస్‌ది అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు డా. లక్ష్మణ్ గారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న గరీబు ఉత్తర్‌ప్రదేశ్ సోకులు పడుతుందని మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై ఎంపీ లక్ష్మణ్ స్పందిస్తూ..యూపీ బీజేపీ పాలనలో పేదలకు 50లక్షల ఇండ్లు కట్టించినట్లు తెలిపారు. అంతేకాకుండా, 2.61 కోట్లకు పైగా టాయిలెట్లు, నెలకు రెండు సార్లు బియ్యంతో పాటు నూనె, పప్పు, చక్కర, ఉప్పు ఉచితంగా ఇస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు 4 నగరాల్లో మెట్రో, 5 నగరాల్లో విమానాశ్రయాలు వీటన్నింటికీ తెలంగాణే నిధులిచ్చిందా కేటీఆర్ గారూ? అంటూ ప్రశ్నించారు. ఇంకా 5 లక్షల ప్రభుత్వ నియామకాలు, 62 లక్షల మందికి ఉచిత వైద్యం, రూ.35వేల కోట్ల రుణమాఫీ, 86 లక్షల రైతులకు ఊరట, ఒక్క ఏడాదిలోనే 21 మెడికల్ కాలేజీలు కట్టించినట్లు తెలిపారు. గరీబు రాష్ట్రంలో ఇవన్నీ సాధ్యమైతే, సంపన్న తెలంగాణలో ఎందుకు సాధ్యం కావడం లేదు కేటీఆర్ గారూ? అంటూ లక్ష్మణ్ సెటైర్లు వేశారు.


Next Story

Most Viewed