Bandla ganesh : జాతీయ పార్టీలోకి బండ్ల గణేశ్.. తెలంగాణలో ఆ స్థానం నుంచి పోటీ?

by Nagaya |   ( Updated:2023-05-15 10:57:08.0  )
Bandla ganesh : జాతీయ పార్టీలోకి బండ్ల గణేశ్.. తెలంగాణలో ఆ స్థానం నుంచి పోటీ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు బండ్ల గణేష్ మరోసారి తెలుగు రాజకీయాల్లో ఆసక్తిగా మారారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నానని గతంలో ప్రకటించిన ఆయన తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరుసగా ఆయన చేస్తున్న ట్వీట్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరోసారి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ఆయన అధికారికంగా ప్రకటించడంతో ఆయన అడుగులు ఎటువైపు అనేది ఆసక్తిని రేపుతోంది. త్వరలో నా రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని రెండు రోజుల క్రితం ట్వీట్ చేసిన బండ్ల.. తాజాగా రాహుల్ గాంధీకి అనుకూలంగా ట్వీట్ చేశారు. కర్ణాటక ఎన్నికల పై స్పందించిన ఆయన 'మీరు మా రాహుల్ గాంధీని ఇల్లు ఖాళీ చేయిస్తే.. కర్ణాటక ప్రజలు రాష్ట్రాన్ని ఖాళీ చేయించారు' అంటూ సోమవారం ఆయన చేసిన పోస్ట్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చగా మారింది.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే బ్లేడ్తో గొంతు కోసుకుంటానని సవాల్ చేశారు. ఆ తర్వాత ఆ కామెంట్స్ ఆయనపై విపరీతమైన ట్రోల్స్‌కు దారి తీసింది. అనంతరం రాజకీయాలు తన వంటి వారికి తగవు అంటూ కాస్త సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేష్ జనసేనలో చేరి తెలంగాణ బాధ్యతలు తీసుకోవాలనే ప్రతిపాదన కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి వినిపించింది. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో అనుకోని మనస్పర్థలు ఏర్పడ్డాయని, పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ కు మధ్య మూడో వ్యక్తి ఇబ్బందులు తెచ్చిపెట్టారని అందువల్లే ఇటీవల పవన్ కు సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది.

ఇంతలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుటుందని పవర్ స్టార్ అనౌన్స్ చేసిన అనంతరం బండ్ల గణేష్ తిరిగి కాంగ్రెస్ కు అనుకూలంగా వరుగా ట్వీట్లు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మదర్స్ డే సందర్భంగా తన తల్లితో పాటు సోనియా గాంధీ ఫోటోను సైతం బండ్ల గణేష్ షేర్ చేశారు. తాజాగా ‘మా రాహుల్ గాంధీ..’ అంటూ కర్ణాటక ఎన్నికలపై రియాక్ట్ అయ్యారు. వీటన్నింటిని బట్టి బండ్ల గణేష్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కాబోతున్నారా అనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ లో యాక్టివ్ అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా చేస్తే ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారు అనేదానిపై రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. షాద్ నగర్‌కు చెందిన బండ్ల గణేష్ అదే స్థానం నుంచి పోటీ చేసి తన అదృష్టానాన్ని పరీక్షించుకోనున్నారా? బండ్ల గణేష్ పోటీకి సిద్ధం అయితే టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీనేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన కాంగ్రెస్‌లోనే తిరిగి యాక్టివ్ అయితే జనసేన విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

Read More: NTR Satha Jayanthi Celebrations: నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానం

Advertisement

Next Story