వాటర్ ట్యాంకులో పడి కోతులు మృతి.. అధికారులపై కేసు నమోదు

by Disha Web Desk 2 |
వాటర్ ట్యాంకులో పడి కోతులు మృతి.. అధికారులపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని హిల్ కాలనీ తాగునీటి వాటర్ ట్యాంకులో పడి పదుల సంఖ్యంలో కోతులు మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ వాటర్ ట్యాంకు నీటిపై దాదాపు 200 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని.. అలాంటి తాగునీటిపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సైతం స్పందించి మున్సిపల్ శాఖ పనితీరు సిగ్గుచేటు, కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ కంటే రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతోందని మండిపడ్డారు. తాజాగా ఈ వాటర్ ట్యాంక్‌ను స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ఘటనపై సీరియస్ అయిన అధికారులు నాగార్జునసాగర్ AE భిక్షం, మరో ఇద్దరు వర్కర్లపై విజయపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడా.. కేసు నమోదైంది.


Next Story

Most Viewed