తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై మోడీ హాట్ కామెంట్స్.. రాహుల్ గాంధీ అదే చేస్తాడు రాసిపెట్టుకోవాలన్న ప్రధాని

by Disha Web Desk 13 |
తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై మోడీ హాట్ కామెంట్స్.. రాహుల్ గాంధీ అదే చేస్తాడు రాసిపెట్టుకోవాలన్న ప్రధాని
X

దిశ, డైనమిక్ బ్యూరో:లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ సాధించబోయే సీట్ల సంఖ్యపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నిక్లలో తెలంగాణతో పాటు దక్షిణ భారత దేశంలో బీజేపీకి ఓటు షేర్ తో పాటు సీట్ల సంఖ్య కూడా పెరగబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఏసియా నెట్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రధాని.. గతంలో పోలిస్తే 2019లోనే బీజేపీకి తెలంగాణలో బీజేపీ ఓటు శాతం, సీట్ల సంఖ్య రెండింతలు అయిందని, గత పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిలో అతిపెద్ద పార్టీగా బీజేపీనే నిలిచిందన్నారు. సౌత్ ఇండియాలో ఉన్న ప్రభుత్వాలు, కాంగ్రెస్, డీఎంకే, ఎల్డీఎఫ్ అన్ని చోట్ల ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇవాళ మేం పుదుచ్చేరిలో అధికారంలో ఉన్నామని పుదుచ్చెరి దక్షిణాదిలో ఉంది కాదా అని ప్రశ్నించారు. ఎక్కువగా దక్షిణాదివారు బెంగాలీ నివసించే అండమాన్ నికోబార్ లో మా ఎంపీ విజయం సాధించారని ఈసారి ఎంపీ ఎన్నికల్లో మా లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు.

ఇదే జరుగుతుంది రాసిపెట్టుకోండి:

కుటుంబ పార్టీలు, ప్రభుత్వాలు ఉన్న చోట భారీ అవినీతి ఉందని ఇప్పుడు దక్షిణాదిన ఎలాంటి పరిస్థితి ఉందో చూడాలన్నారు. కాంగ్రెస్ యువరాజు (రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండా) ఉత్తరాది నుంచి పారిపోయి దక్షిణాదిలో ఆశ్రయం పొందుతున్నాడు. అతడు వయనాడ్ లో పోటీ చేస్తున్నాడు. అతడి పరిస్థితి ఎలా ఉందండే ఏప్రిల్ 26న వయాన్డ్ లో పోలింగ్ ముగియగానే మరో చోట పోటీ చేయాలని భావిస్తున్నాడు. ఇది కచ్చితంగా జరుగుతుంది రాసి పెట్టుకోవాలన్నారు. అలాగే కాంగ్రెస్ కు చెందిన పెద్ద నాయకులు ఇకపై లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోరని రాజ్యసభకు వెళ్తారని నేను గతంలోనే పార్లమెంట్ లో ప్రకటించానని నేను ఈ మాట చెప్పిన నెల రోజుల తర్వాత అతిపెద్ద నాయకురాలు లోక్ సభ నుంచి నిష్క్రమించి రాజ్యసభకు వెళ్లారు. అంటే వీరంతా ఓటమి అంగీకరించినట్లే కదా. ఈసారి కూడా తాను చెప్పినట్లు జరుగుతుందనే నమ్మకం నాకు ఉందన్నారు.

నేను ఎంజాయ్ చేసే రకం కాదు:

చాలా కాలంగా బీజేపీ అంటే అగ్రవర్ణాలు, అర్బన్ పార్టే అనే ప్రచారం సృష్టించారు. కానీ నిజానికి బీజేపీలోనే అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సభ్యులుగా ఉన్నారు. అలాగే గ్రామీణ ప్రజలే ఎక్కువగా పార్టీ వెంట నడుస్తున్నారని చెప్పారు. బీజేపీని అడ్డుకునేందుకు ఇటువండి నెరెటీవ్ ను క్రియేట్ చేస్తున్న వారి భ్రమలు భ్రమలుగానే మిగిలిపోతాయన్నారు. నా దృష్టిలో ప్రభుత్వాన్ని నండపడం అంటే పాలించడమని అర్థం కాదని సేవచేయడం అన్నారు. నేను ప్రధాని పీఠంపై కూర్చుని ఎంజాయ్ చేయాలనే రకం కాదు. నేను ప్రజల కోసం సాధారణ పౌరుడికంటే కష్టపడి పనిచేస్తానని చెప్పారు. మా పనితీరును ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. 2014 లో ఆశాజనక వాతావరణం ఉంటే 2019 అది విశ్వాసంగా మారింది.

ఈడీ కేసులపై స్పందిస్తూ..

సామాన్య ప్రజలు చూపించే నమ్మకం నాలో కొత్త విశ్వాన్ని నింపింది. మేము సరైన దిశలోనే ఉన్నామని అనుకున్నాం. 2014లో ప్రజల వద్దకు గ్యారంటీలతో వెళ్తున్నాం. ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు. 30 ఏళ్లుగా అస్థిర ప్రభుత్వాలతో ప్రపంచం ముందు భారత్ కు విలువ లేకుండా పోయింది. తాము అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. అందుకే ఈసారి ఎన్నికల్లో మోడీ, బీజేపీ పోటీ చేయడం లేదని దేశ ప్రజలే మా 10 ఏళ్ల పాలనను చూసి నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పారు. అందుకే ఈ ఎన్నికలు చాలా ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. ఈడీ, సీబీఐ దుర్వినియోగం ఆరోపణలపై స్పందిస్తూ.. వారి బాధ్యతలు వారికి ఉన్నాయి. ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ఆపకూడదు. ఈడీ కేసుల్లో కేవలం 3 శాతం మంది మాత్రమే రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి. మిగతా 97 శాతం తమ పనిలో నిజాయితీగా వ్యవహరించకపోవడంతోనే పట్టుబడ్డారు. ప్రధాన మంత్రిని అయినప్పటికీ ఈడీ పనిని అడ్డుకునే హక్కు నాకు లేదని వారని స్వతంత్రంగా పని చేసుకోనివ్వాలన్నారు.



Next Story