చాలాకాలం తర్వాత ఒకరినొకరు పలకరించుకున్న BRS నేతలు

by Disha Web Desk 2 |
చాలాకాలం తర్వాత ఒకరినొకరు పలకరించుకున్న BRS నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప్పు-నిప్పుగా ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి దీర్ఘకాలం తర్వాత ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ ఇద్దరి మధ్య తీవ్రమైన రాజకీయ వైరం నెలకొన్న సమయంలో కలుసుకోవడం జిల్లావ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. గృహప్రవేశానికి రావాల్సిందిగా పట్నం మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఇటీవల పట్నం మహేందర్‌రెడ్డి కుమార్తె వివాహమైనా ఎమ్మెల్యే పైలట్‌కు ఆహ్వానం అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చొరవ తీసుకుని పైలట్ గృహప్రవేశం ఇన్విటేషన్‌ను పట్నం మహేందర్‌రెడ్డికి అందజేయడం పలు ఊహాగానాలకు దారితీసింది. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణికి ఈ ఇన్విటేషన్ ఏ మేరకు దోహదపడుతుందనే చర్చ మొదలైంది.

Read more:

ప్రగతిభవన్‌లో BRS ఎమ్మెల్యేలకు అనుమతి నిరాకరణ!


Next Story