- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం రేవంత్ రెడ్డిపై MLA కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి.. రేవంత్ రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతులో పాతిపెడతా అంటే.. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కోపం రాదా? అని ప్రశ్నించారు. కావాలనే రాజకీయ లబ్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను రెచ్చగొడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
చార్లెస్-ఓబులా, బిల్లా-రంగా అని తమ నేతలను విమర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటో ప్రజలకు తెలియదా? అని అన్నారు. రేవంత్ రెడ్డి పాత కేసుల వివరాలు ప్రజల ముందు పెట్టాలా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో 420 హామీలు గుప్పించారు.. రెండు హామీలు అమలు చేశారు. మిగతావి అమలు చేస్తారో లేదో తెలియదు అని ఎద్దేవా చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని సీరియస్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు బాధపడుతున్నారని గుర్తుచేశారు.
తమపై ప్రజల్లో వ్యతిరేకత లేదని.. ఉండి ఉంటే 39 స్థానాల్లో అండగా ఉండేవారు కాదని చెప్పారు. కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇచ్చారని.. దానిని కూడా హస్తం నేతలు కాపాడుకోలేక నెల రోజులకే చేతులెత్తేశారని విమర్శించారు. కేసీఆర్‌ను ఎందుకు ఓడించామా? అని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని తెలిపారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. కాలయాపన చేయకుండా ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.