HYD: మహాగణేషుడికి తొలి పూజ.. హాజరైన గవర్నర్ తమిళిసై

by GSrikanth |
HYD: మహాగణేషుడికి తొలి పూజ.. హాజరైన గవర్నర్ తమిళిసై
X

దిశ, డైనమిక్ బ్యూరో: వినాయక చవితి పర్వదినం సందర్భంగా సోమవారం ఖైరతాబాద్ గణపతి వద్ద కోలాహలం మొదలైంది. బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలిపూజ చేశారు. ఈ ఏడాది శ్రీ దశమహా విద్యాగణపతిగా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. వైభవంగా జరిగిన తొలిపూజలో గవర్నర్ తో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున గణనాథుడికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న ఖైరతాబాద్ మహాగణపతికి పద్మశాలి సంఘం గరికమాల, జంధ్యం, 75 అడుగుల భారీ కండువాను సమర్పించింది. ఈ సారి 63 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీదశమహా విద్యాగణపతికి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Advertisement

Next Story