రాష్ట్రంలో 17వేల క్రీడా ప్రాంగణాలు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Dishafeatures2 |
రాష్ట్రంలో 17వేల క్రీడా ప్రాంగణాలు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని 17వేల గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను నిర్మించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హకీంపేట్ లోని తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో రూ.17 కోట్ల తో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ హాల్, వెయిట్ లిఫ్టింగ్ హాల్, రోయింగ్ హాల్, ఫిజియోథెరపీ హాల్, స్ట్రెంత్ అండ్ కండిషన్ హాల్, క్రాస్ ట్రాక్ లను మంత్రి మల్లారెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2శాతం రిజర్వేషన్లు, ఉన్నత విద్య అభ్యసించడం కోసం 0.5శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించామని, వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదింప చేసుకుంటామని స్పష్టం చేశారు. క్రీడ పాఠశాలలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా మారుస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, క్రీడా పాఠశాల ఓ ఎస్ డీ డాక్టర్ హరికృష్ణ, సాట్స్ ఉన్నతాధికారులు సుజాత, మనోహర్ పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed