నిరుద్యోగులకు మంత్రి పొంగులేటి శుభవార్త.. నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన

by GSrikanth |
నిరుద్యోగులకు మంత్రి పొంగులేటి శుభవార్త.. నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏడాదిలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను, భర్తీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఏడాదిలోపే అమలు చేసి తీరుతామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన ‘తెలంగాణ పునర్నిర్మాణం’ సదస్సులో పాల్గొన్నారు. ఇప్పటికే 23 వేల ఉద్యోగాలను భర్తీ చేసామని, మార్చి 2వ తేదిన వివిధ విభాగాలకు సంబంధించి ఆరువేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. త్వరలో మెగా డీఎస్సీని కూడా ప్రకటించబోతున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు టీఎస్పీఎస్సి ను ప్రక్షాళన చేసామని అనుభవమైన నిజాయితీ గల అధికారులను అక్కడ నియమించడం జరిగింది. నీళ్ళ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ కు మంచి జరిగేల నిర్ణయాలు తీస్కున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ పెద్దలు 80 వేల పుస్తకాలు చదివానని, తానే ఇంజనీర్ ను, తానే తాపీ మేస్త్రి ని, తానే ఒక డిజైనర్ ను అంటూ ప్రపంచ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా నిర్మించానని ప్రచారం చేసుకున్న ఆ పెద్దమనిషి ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రపంచ అద్భుతం నేడు కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసారు. గత ప్రభుత్వ అవినీతికి కాళేశ్వరం ఒక నిదర్శనం అన్నారు. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రారంభించిన జలయజ్ఞంలో భాగంగా గోదావరి, కృష్ణా నదులమీద చేపట్టిన ప్రాజెక్టులను ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రీ-డిజైన్ పేరుతో దోచుకుని ధనిక రాష్ట్రాన్ని, ఏడు లక్షల కోట్ల అప్పులోకి నెట్టారని, ప్రతి తెలంగాణ బిడ్డపైన అప్పుల భారాన్ని మోపిన ప్రభుద్దులు, గత ప్రభుత్వ పెద్దలని దుయ్యబట్టారు.

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాలను అమలు చేస్తున్నామని అధికారంలో వచ్చిన రెండు రోజుల్లోనే, రెండు గ్యారంటీలను అమలు చేసామని ఈ నెల 27న మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యాన్ని గురైన విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. యూనివర్సిటీలలో ఖాళీలను సైతం భర్తీ చేస్తామని, ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలను త్వరలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ ఊహించని రీతిలో విధ్వంసానికి గురి అయిందన్నారు. అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసారో చెప్పడానికి ఇటీవల విడుదల చేసిన కాగ్ రిపోర్టు నిదర్శనమన్నారు. పదేండ్లపాటు అధికారాన్ని వారి స్వప్రయోజనాలకు వాడుకున్నారని విమర్శించారు. ముప్పై ఏళ్ళ తర్వాత ఆర్ట్స్ కాలేజీకి అధికార హోదాలో క్యాబినెట్ మంత్రి రావడం గమనార్హం. ముప్పై సంవత్సరాల క్రితం క్యాబినెట్ మంత్రి హోదాలో సమాచార శాఖ మంత్రిగా డి.శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళారు. అప్పట్లో యూనివర్సిటీ అధికారులు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.Next Story

Most Viewed