ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 4 |
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి : ప్రజలు సరక్షితమైన ప్రయాణానికి ఆర్టీసి సంస్థ కల్పిస్తున్న సౌకర్యవంతమైన బస్సు సర్వీస్లలోనే ప్రయాణాలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఆర్‌టీసీ బస్టాండ్ ఆవరణంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి వనపర్తి బస్సు డిపోకు అదనంగా మంజూరైన రెండు సూపర్ లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

ఆర్టీసీ బస్టాండ్ నుండి ఎంసీఎచ్ ఆసుపత్రి వరకు మంత్రి నిరంజన్ రెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వేసేవి కాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేందుకు అంబలి, మజ్జిగ వంటి చల్లటి పానీయాలను తీసుకోవాలన్నారు. అమ్మ తారకమ్మ జ్ఞాపకార్థం వనపర్తి జిల్లాలో ఉచిత అంబలి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగించాలన్నారు. ఆర్టీసీ సంస్థ అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, వైస్ చైర్మెన్ శ్రీధర్, పరమేశ్వరమ్మ, ఆర్టీసీ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు, మైనారిటీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed