‘అంబేద్కర్’ సాక్షిగా కేసీఆర్ కాళ్లు మొక్కిన మంత్రి కొప్పుల

by Dishafeatures2 |
‘అంబేద్కర్’ సాక్షిగా కేసీఆర్ కాళ్లు మొక్కిన మంత్రి కొప్పుల
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పై నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది.

ప్రకాశ్ అంబేద్కర్ తో కలిసి ఆశీర్వాదం తీసుకోవడానికి సీఎం కేసీఆర్ బౌద్ధ భిక్షువుల వద్దకు వచ్చారు. ఓ పక్క సీఎం కేసీఆర్ బౌద్ధ భిక్షువుల ఆశీర్వాదం తీసుకుంటుండగా మరోపక్క అక్కడే ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ మాత్రం కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలురకాల కామెంట్స్ వస్తున్నాయి. దళితుల అభ్యున్నతి కోసం, వారి ఆత్మ గౌరవం కోసం కడవరకు పోరాడిన అంబేద్కర్ జయంతి రోజున.. అదీ సాక్షాత్తు ఆయన విగ్రహం ముందు ఓ దళిత మంత్రి సీఎం కాళ్లు మొక్కడమేంటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ మెప్పు కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ దళితుల పరువు తీశారని వారు మండిపడుతున్నారు. అంబేద్కర్ చెప్పిందే ఇదేనా అంటూ వారు నిలదీస్తున్నారు.

Next Story

Most Viewed