'Prime Minister Narendra Modi మాట తప్పారు'

by Disha Web Desk 2 |
Prime Minister Narendra Modi మాట తప్పారు
X

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణిలో నాలుగు బ్లాక్ లు వేలానికి పెట్టడంపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ని ప్రైవేట్ పరం చేయబోమని చెప్పిన ప్రధాని మోడీ ఇప్పుడు మాట తప్పారని, సింగరేణిని వేలానికి పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీజేపీ నేతలు అబద్దాలు చెబుతారని మరోసారి అర్థమైందని ఎద్దేవా చేశారు. కాగా దేశంలోని బొగ్గు గనుల కమర్షియల్ వేలాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం మొదలు పెట్టింది. ఇందులో సింగరేణికి చెందిన 4 బొగ్గు గనులను కూడా వేలానికి పెట్టడంపై టీఆర్ఎస్, సింగరేణి కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. బొగ్గు గనులను వేలం వేయబోమని చెప్పిన ప్రధాని మోడీ కోల్ ఇండియాను అమ్మేందుకు రంగం సిద్ధం చేశారని ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు గనుల కంపెనీగా కోల్ ఇండియాకు గుర్తింపు ఉందని, లాభాల్లో ఉన్న ఈ సంస్థ వాటాలను విక్రయించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. అయినా ప్రభుత్వం వేలానికి మొగ్గుచూపడంతో టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి గనుల వేలం పేరుతో తెలంగాణ వనరులను కార్పొరేట్ గద్దలకు పంచిపెట్టాలనుకుంటున్న బీజేపీ ప్రభుత్వ పెద్దల కుట్రలను ఎండగడదామంటూ నిరసనలు తెలుపుతున్నారు.

Next Story

Most Viewed