ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్ విద్యార్థుల మాదిరే వసతులు.. మంత్రి గంగుల కమలాకర్

by Dishafeatures2 |
ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్ విద్యార్థుల మాదిరే వసతులు.. మంత్రి గంగుల కమలాకర్
X

దిశ , తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని 302 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో చదువుకునే కాలేజీ విద్యార్థులకు నాణ్యమైన బోజన, వసతులతో అధనంగా ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల విద్యార్థుల మాదిరి సౌకర్యాలు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఇందుకు సంబదించిన ఉత్తర్వులను అయన విడుదల చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్, బెడ్డింగ్ మెటీరియల్, వులన్ బ్లాంకెట్స్, నోట్ బుక్స్ అందజేయడం జరుగుతుందన్నారు. దీని వల్ల ఏటా 12 కోట్లను అదనంగా కేటియించడం ద్వారా దాదాపు 34వేల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారన్నారు.

కేవలం 19 ఉన్న బీసీ గురుకులాలను ఇప్పటికే 327కు పెంచడమే కాకుండా, మహాత్మా జ్యోతీబాపూలే పేరున ఒక్కో విద్యార్థికి 20 లక్షల విదేశీ విద్యానిధి, రాష్ట్రంలోని విద్యార్థులకు పీజు రీయంబర్మెంట్ అందజేస్తున్నామని తెలిపారు. ఈ ఏడు నుంచి దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి విద్యాసంస్థల్లో చదివే వెనుకబడిన వర్గాల బిడ్డలకు సైతం ఫీజులను చెల్లిస్తునట్టు అయన పేర్కొన్నారు. చరిత్రలో మొదటి సారిగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బీసీ విద్యార్థుల చదువుకు ఊతమిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, యావత్ బీసీ సమాజం పక్షాన మంత్రి కృతజ్ణతలు తెలిపారు.

Next Story

Most Viewed