మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు.. విజిలెన్స్ రిపోర్టులో సంచలన విషయాలు

by Disha Web Desk 4 |
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు.. విజిలెన్స్ రిపోర్టులో సంచలన విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెబుతూ వచ్చారు. సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో స్టేట్ పాలిటిక్స్‌లో ప్రకంపనలు చెలరేగాయి. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాయి. తద్వారా బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఈ ప్రాజెక్టు కుంగుబాటు కూడా ఓ కారణమైంది. ఇక, ఈ ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ సర్కారు ఫోకస్ చేసిన విషయం తేలిసిందే. ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన విజిలెన్స్ తాజాగా నివేదికను రెడీ చేసింది.

వరదల కారణంగా డ్యామేజ్ జరగలేదని మానవ తప్పిదం వల్లే డ్యామేజ్ అయినట్లు విజిలెన్స్ ఓ క్లారిటీకి వచ్చింది. స్టీల్, కాంక్రీట్ లో నాణ్యత లోపం ఉన్నట్లు విజిలెన్స్ తేల్చింది. మేడిగడ్డ నిర్మాణంపై శాటిలైట్ డేటాను విజిలెన్స్ అడిగింది. కాగా రెండు, మూడు రోజుల్లో ఈ రిపోర్టు విజిలెన్స్‌కు అందనున్నట్లు తెలుస్తోంది. 2019లోనే మేడిగడ్డ డ్యామేజ్ అయినట్లు విజిలెన్స్ భావిస్తోంది. ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత మొదటి వరదకే పగుళ్లు వచ్చాయని అనుమానం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి రికార్డులు మాయం అయ్యాయని విజిలెన్స్ గుర్తించింది. త్వరలో విజిలెన్స్ పంప్ హౌస్ లపై విచారణ స్టార్ట్ చేయనుంది.



Next Story

Most Viewed