హైదరాబాద్ కు బొడ్రాయిగా ‘అంబేద్కర్’.. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్

by Dishafeatures2 |
హైదరాబాద్ కు బొడ్రాయిగా ‘అంబేద్కర్’.. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ కు బొడ్రాయిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నిలువనుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మించడంతో పాటు.. తెలంగాణ పరిపాలన సౌధం సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు అన్ని కుల సంఘాల నేతలతో కలిసి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి 500 కిలోల గులాబీలతో పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. అంబేద్కర్ సూపిన బాటలోనే కేసీఆర్ దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని వివరించారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరుపెట్టడం సంతోషంగా ఉందన్నారు.

దేశంలో ఎక్కడలేని విధంగా దళితుల అభ్యున్నతికి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారన్నారు. సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని వెల్లడించారు. టీ ప్రైడ్ పథకంతో మధ్య, చిన్న తరహా పరిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు రాంచందర్ మాల, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, జై భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు పి. బల్వంత్ రావు మాల, టీఎమ్ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బి.ఎన్ రమేష్ మాదిగ, తెలంగాణ స్టేట్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కె. గిరిందర్ మాల, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య, జాతీయ మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కరణం కిషన్, దళిత నేతలు జన్ను కనకరాజు, రావుల విజయ్ కుమార్, గంధం రాములు, గంప రాజేష్, బూడాల బాబురావు, శేఖర్, శ్రీకాంత్, డేవిడ్ జంపాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed