అనుమతి లేని ఆసుపత్రి సీజ్

by Disha Web Desk 23 |
అనుమతి లేని ఆసుపత్రి సీజ్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: అనుమతి లేని ఆసుపత్రులపై జిల్లా వైద్యాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి చైర్మన్ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లాలో నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు ఆసుపత్రులను సీజ్ చేశారు.ఈ నేపథ్యంలో మంగళవారం మేడ్చల్ మండలంలోని గుండ్ల పోచంపల్లి లో కవిత ప్రథమ చికిత్స పేరిట ఎలాంటి అనుమతి లేకుండా ఆసుపత్రిని మేఘావత్ కవిత నిర్వహిస్తున్నారు.

టీఎస్ఎంసీ చట్ట ప్రకారం అనుమతి లేకుండా ఆసుపత్రిని నిర్వహిస్తున్న కవితపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు లేఖ రాసింది. ఈ తరుణంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రఘునాథ స్వామి,డిప్యూటీ డీఎంహెచ్ ఓ డాక్టర్ నారాయణ రావు, కీసర డివిజన్ డాక్టర్ లావణ్య,శ్రీ రంగ వరం పిహెచ్ సీ వైద్యాధికారి శ్రీనివాస్ తో పాటు రెవెన్యూ, పోలీసు అధికారులు పంచనామా నిర్వహించి కవిత ప్రథమ చికిత్స కేంద్రాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రఘునాథ స్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆసుపత్రులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


Next Story

Most Viewed