అనుమానంతో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త

by Anjali |
అనుమానంతో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: అనుమానం పెను భూతంగా మారి.. కట్టుకున్న భర్తే, భార్యను కిరాతకంగా హత్యచేసిన ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలంలోని విజయనగర్ కాలనీలో చోటుచేసుకుంది. రాజేందర్ (45), కృష్ణకుమారి(38) భర్తభర్తలిద్దరు ఎంతో అనోన్యంగా కలిసిమెలసి ఉండేవారు. భర్త వ్యవసాయ పనులు చూసుకుంటాడు. భార్య కృష్ణకుమారి కాచిగూడలోని ఓ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తుంది. ఇటీవల క్రమంలో భార్యపై రాజేందర్ కు అనుమానం రావడంతో తరచూ వేధించడం ప్రారంభించాడు. తాజాగా భర్యాభర్తలైన రాజేందర్, కృష్ణకుమారి గొడవ పడ్డారు. ఆ గొడవ కాస్త ఎక్కువవడంతో తీవ్ర ఆవేశానికి గురైన రాజేందర్.. భార్యపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో కృష్ణకుమారి అక్కడికక్కడే మృతిచెందింది.Next Story

Most Viewed