మల్లారెడ్డి యూనివర్సిటీ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

by Kalyani |
మల్లారెడ్డి యూనివర్సిటీ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
X

దిశ,పేట్ బషీరాబాద్: పురుగుల మందు తాగి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసిన యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మైసమ్మగూడ మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ లో హరినాథ్ అనే విద్యార్థి మూడో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్న సమయంలో విద్యార్థి పురుగుల మందు తాగి అనంతరం వసతిగృహం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడివారు విద్యార్థినిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు సంఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.Next Story

Most Viewed