మనసులో మాట చెప్పేసిన మర్రి... ఇక నెక్ట్స్ ఏంటీ ?

by Dishanational1 |
మనసులో మాట చెప్పేసిన మర్రి... ఇక నెక్ట్స్ ఏంటీ ?
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: కంటోన్మెంట్ బోర్డ్ ఎలక్షన్ల ప్రకటన వెలువడిన తర్వాత రోజే ఎమ్మెల్యే సాయన్న చనిపోవడంతో పెద్ద దిక్కు కరువైంది. గతంలో సాయన్న ఎలా చెప్తే అలానే నడిచేది..ఇప్పుడు మాత్రం వర్గపోరు లేదనక తప్పదు.. కంటోన్మెంట్ బోర్డ్ ఎలక్షన్లు దగ్గర పడుతుండడంతో సిట్టింగ్ మాజీ బోర్డు సభ్యులు నమ్ముకున్న నాయకుడు బి.ఆర్.ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆశావాహులు కూడా మేమేమి తీసిపోము అన్నట్టు వారు కూడా కలిసి వారి బలా బలాలు చెప్పుకుంటున్నారు. కానీ మర్రి రాజశేఖర్ రెడ్డి ఎవరిని ఏమి అనలేక, ముందే ఏమనుకున్నాడో దానికే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.. ముందు ముందు మీకే తెలుస్తోంది అన్నట్లుగా సైలెన్స్ గా తాను చేసే పని తాను చేస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బోర్డ్ 8 వార్డులకు గాను, వార్డు 2, వార్డు 5 మినహా అందరూ బీఆర్ఎస్ మాజీ బోర్డ్ సభ్యులు కావడంతో రాజశేఖర్ రెడ్డికి టచ్ లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆశావాహులను, అసమ్మతి నేతలను కూడా అన్ని తానై బుజ్జగింపు చేసే పనిలో పడ్డారు.

ఆశావాహులు, అసమ్మతి నేతలతో సమావేశం

కంటోన్మెంట్ బోర్డ్ ఎలక్షన్లకు పార్టీ గుర్తులు లేకపోవడం ఒక ఎత్తైతే, పార్టీ పరంగా బలపరిచిన అభ్యర్థులుగా బరిలోకి దిగడం.. అన్నీ పార్టీ ముఖ్య నాయకులు, ఇంచార్జ్ లు దగ్గరుండి ఎలక్షన్ చూసుకుంటారు. ఈసారి మాత్రం పార్టీ బలపరచిన అభ్యర్థులను ప్రకటిస్తే, రెబల్ గా మేము కూడా బరిలో ఉంటామని నేతలు బాహాటంగానే చెప్తున్నారు. రెబల్ అభ్యర్థులతో బీఆర్ఎస్ కు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ, త్వరలోనే అన్నీ సమసి పోతాయని మర్రి మనసులో మాట చెప్పేశారు. మొత్తానికి అధికారికంగా కంటోన్మెంట్ ఇంచార్జ్ గా మర్రికి భాద్యతలు లేకపోయినా అన్ని తానై ముందుకు నడిపిస్తున్నారు.

సాయన్న వర్గంలో కూడా పోటీకి సై అంటున్న నేతలు

సాయన్న హఠాన్మరణం కంటోన్మెంట్ ప్రజలతోపాటు, నమ్ముకున్న నాయకులకు తీరని లోటు, కోలుకోలేని దెబ్బగా చెప్పక తప్పదు. కొంతమంది నేతలు మాత్రం సాయన్న బొమ్మతో బరిలోకి దిగడానికి వెనుకాడమని అంటున్నట్లు తెలుస్తోంది. సాయన్న ఉన్నప్పుడు కొంతమంది నాయకులకు ఈసారి మీకు బోర్డ్ ఎలక్షన్లలో స్థానం కల్పిస్తామని అన్నట్టు కూడా ఆ నోటా, ఈ నోటా బయటపడుతున్నాయి. సాయన్న మృతి మాత్రం అందరికి విషాదాన్ని నింపినప్పటికీ, కొంతమంది రాజకీయ ఆశావాహులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లిందనే చెప్పాలి. సాయన్న దశ దిన కర్మ అనంతరం ఆశావాహులపై పూర్తి స్పష్టత రానుంది. మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం పార్టీ పెద్దలు, మంత్రులు చూసుకుంటారని, తనకు ఏ భాద్యతలు అప్పజెప్పినా చేయడానికి సిద్ధం అని చేతులు దులుపుకున్నారు. అలా అని వచ్చిన ఆశావాహులతో మాట్లాడుతూ, వారిని మాత్రం లైట్ గా తీసుకోకుండా, మర్రి రాజశేఖర్ రెడ్డి పథకం ప్రకారమే ముందుకెళ్తున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డ్ ఎలక్షన్ రాజకీయం మాత్రం బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే తిరుగుతోందని చెప్పక తప్పదు..!!

Next Story

Most Viewed