రూ. 53 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం..

by Kalyani |
రూ. 53 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం..
X

దిశ, కూకట్​పల్లి: ఫతేనగర్​ డివిజన్​ పరిధిలో రూ. 53 లక్షల వ్యయంతో చేపడుతున్న తాగునీటి పైప్​లైన్​ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం కార్పొరేటర్​ పండాల సతీష్​ గౌడ్​తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఇంటికి తాగునీటిని అందించేందుకు ప్రణాళిక బద్ధంగా పని చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

వేసవి కాలంలోను నీటి సమస్య ఏర్పడకుండా సీఎం కేసీఆర్​ ముందుచూపుతో నీటి సమస్యను పరిష్కరించారని అన్నారు. 9 ఏండ్ల కాలంలో కూకట్​పల్లి నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అభివృద్ధి సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కంచి బిక్షపతి, కే. రాములు, నర్సయ్య, స్వామి, రాజ్ కుమార్, సత్యనారాయణ, నంద కుమార్, టి. రవీందర్ గౌడ్, భగాయ్యా, దత్త రావు, నశు, సలావుద్ధిన్, రహిమా, బాలమణి, జయ్యమ్మ, సురేందర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Next Story