మేడ్చల్ ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం.. ఒక్కరు మృతి

by Mahesh |
మేడ్చల్ ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం.. ఒక్కరు మృతి
X

దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ ఓ అర్ అర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం తెల్లవారుజామున ఓఆర్ఆర్ పై సుతారి గూడ గ్రామం వద్ద పటాన్ చెరువు నుండి మేడ్చల్ వైపు వస్తుండగా ఆగి ఉన్న కంటైనర్ ను డీసీఎం ఢీ కొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్ వాహనాన్ని దిగి తనిఖీ చేస్తుండగా వెనక నుంచి వచ్చిన మరో కంటైనర్ డీసీఎం డ్రైవర్ ఢీ కొట్టింది. డీసీఎం డ్రైవర్ మృతి చెందగా..మరోకరి పరిస్థితి విషమంగా ఉందని మేడ్చల్ మండలంలోని సుతారిగూడ గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్ రవికుమార్‌గా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Next Story

Most Viewed