అనుమతులా..అవెక్కడ..?.. అనుమతులు నిల్.. నిర్మాణాలు ఫుల్

by Disha Web Desk 23 |
అనుమతులా..అవెక్కడ..?.. అనుమతులు నిల్.. నిర్మాణాలు ఫుల్
X

దిశ, దుండిగల్ : దుండిగల్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు కొదవేలేదు. అది ప్రభుత్వ స్థలమైన, ప్రజాప్రయోజన స్థలమైనా. చివరకు ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న స్థలమైనా సరే అధికారులు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు,స్థానిక ప్రజాప్రతినిధులు తలచుకుంటే అది అక్రమమైన సక్రమమే. అక్రమంగా నిర్మిస్తున్న షెడ్ అయినా,అనుమతి లేని బహుళ అంతస్తుల భవన మైనా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లైన్ మెన్ ల సహకారం ఉంటే యథేచ్ఛగా అక్రమనిర్మాణాలు కొనసాగించవచ్చు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ లో కంజర్వేషన్ జోన్ లో గత ప్రభుత్వ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధుల అండతో మొదలైన అక్రమ నిర్మాణాలు నేటికి మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా కోనసాగుతున్నాయి.

మున్సిపల్ అధికారులు పట్టించుకోరు. జిల్లా అధికారులు కన్నెత్తిచూడరు. స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు,వార్తా కథనాలతో మేలుకుంటున్న అధికారులు చర్యల్లో మమ అనిపిస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారస్సుతో చర్యలకు వెనకడుగు వేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఫిర్యాదులను పక్కనపెట్టి ముడుపులతో సరిపెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంజర్వేషన్ జోన్ లో నిర్మాణ అనుమతులు పొందాలంటే 5 గురు మంత్రులతో కూడిన క్యాబినెట్ ఆమోదం ఉండాలి. లేదా అప్పట్లో 1 రూపాయ ఎల్ ఆర్ ఎస్ ఫీజ్ కట్టివుండాలి.

బౌరంపేటలోని ఆర్కే టౌన్షిప్ కు ఆనుకొని ఉన్న 4 ఎకరాల కంజర్వేషన్ జోన్ లో నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇప్పటికే 2 ఎకరాలలో ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామస్తులను అడ్డంపెట్టుకుని 6 విల్లాలు నిర్మించిన ఓ బడా బిల్డర్ 500 గజాల స్థలంలో మరో 6 అంతస్తుల భవన నిర్మాణానికి తెరలేపాడు. అంతటితో ఆగని సదరు బిల్డర్ 300 గజాల లో మరో భవన నిర్మాణానికి పిల్లర్లు వేస్తున్నట్లు సమాచారం. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలిసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోరు.జిల్లా అధికారులు కన్నెత్తి చూడరు. దుండిగల్ మున్సిపల్ లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ చైన్ మెన్ లు చెప్పిందే వేదం అన్నట్లుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

గత పాలకుల అండతోనే

బౌరంపేట ఆర్కే టౌన్షిప్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు గత ప్రభుత్వ పాలకులే కారణంగా తెలుస్తోంది. గ్రామస్తులను అడ్డంపెట్టుకుని ఇప్పటికే 6 విల్లాల నిర్మాణం చేపట్టిన సదరు బిల్డర్ మరో బహుళ అంతస్తుల నిర్మాణానికి తెరలేపారు. అంతటితో ఆగని బిల్డర్ మరో 300 గజాల లో పిల్లర్ల నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. అధికారుల చర్యలతో అక్రమనిర్మాణాలకు అడ్ఫుకట్టపడేనా...

ఇక్కడ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ చైన్ మెన్ లదే హవా

దుండిగల్ మున్సిపాలిటీ లో గత 5 సంవత్సరాలుగా పూర్తి స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులు లేకపోవడం,మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కి పరిమితం కావడంతో టౌన్ ప్లానింగ్ సెక్షన్ చైన్ మెన్ లు చెప్పిందే వేదం,చేసిందే చట్టం అన్నట్లుగా సాగింది. బహుళ అంతస్తుల భవనమైనా,అనుమతి లేని షెడ్ అయినా సరే టౌన్ ప్లానింగ్ సెక్షన్ చైన్ మెన్ అండవుంటే అది అక్రమమైన సక్రమమే అన్నట్లుగా సాగుతున్నాయి,బౌరంపేట లోని కంజర్వేషన్ జోన్ లో ఎటువంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న అక్రమనిర్మాణాలకు మున్సిపల్ అధికారులు,టౌన్ ప్లానింగ్ సెక్షన్ చైన్ మెన్ ల అండ పుష్కలంగా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి,ప్రస్తుతం పూర్తి స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారి రాకతో అక్రమ నిర్మాణాలకు అడ్డికట్టపడేనా..?

కమిషనర్ కాగితాలకే పరిమితం

దుండిగల్ మున్సిపాలిటీ లో జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న కమిషనర్ కాగితాలకే పరిమితం అవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి,ఇంత కాలం పూర్తి స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారి లేకపోవడంతో టౌన్ ప్లానింగ్ సెక్షన్ చైన్ మెన్ లు చెప్పిందే వేదం చేసిందే చట్టం అన్నట్లుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు కన్నెత్తి చూడటం లేదన్నది బహిరంగ రహస్యమే.


Next Story

Most Viewed