మహిళా రిజర్వేషన్లపై కేంద్రం దాగుడు మూతలు.. నిజాంపేట్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి

by Dishafeatures2 |
మహిళా రిజర్వేషన్లపై కేంద్రం దాగుడు మూతలు.. నిజాంపేట్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి
X

దిశ, కుత్బుల్లాపూర్ : మహిళల రిజర్వేషన్ పట్ల కేంద్ర ప్రభుత్వం దాగుడు మూతలు ఆపి చట్ట సభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని నిజాంపేట్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమని భావించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 50 శాతానికి పైగా స్థానిక సంస్థలో మహిళలు ప్రాతినిధ్యం వహించేలా కృషి చేస్తోందని మేయర్ తెలిపారు.

కానీ దేశంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ మహిళల హక్కులపై, మహిళా సాధికారత పై స్పందించక పోవడం బాధాకరం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 13 కార్పొరేషన్ లలో కార్పొరేటర్ లు, మేయర్ లు, 125 మున్సిపాలిటీలలో మున్సిపల్ చైర్ పర్సన్ లు, కౌన్సిలర్ల పదవులలో మహిళకు 50 శాతానికి పైగా రిజర్వేషన్లను కల్పించిందని గుర్తు చేశారు.


Next Story

Most Viewed