అల్లాపూర్​ డివిజన్​లో పర్యటించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

by Kalyani |
అల్లాపూర్​ డివిజన్​లో పర్యటించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
X

దిశ, కూకట్​పల్లి: అల్లాపూర్​ డివిజన్​ పరిధిలోని గాయత్రి నగర్​ కాలనీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుధవారం స్థానిక కార్పొరేటర్​ సబీహా బేగం, వివిధ విభాగాల అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్​ పరిధిలోని సున్నం చెరువు పార్కును పరిశీలించారు. పార్కు పనులను వేగంగా పూర్తి చేయాలని, వాకర్స్​కు అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులకు కావలసిన నిధులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తే నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని అన్నారు. డివిజన్​ పరిధిలోని తులసి నగర్​ కాలనీలో వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని, విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​లను మార్చాలని కాలనీ వాసులు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్​ ఈఈ సత్యనారాయణ, ఏఈ రంజిత్, జలమండలి డీజీఎం రవి, లైన్ మెన్ మొగులయ్య, వర్క్ ఇన్స్పెక్టర్​ బలరాం, డివిజన్​ అధ్యక్షుడు లింగాల ఐలయ్య, వీరారెడ్డి, పిల్లి తిరుపతి, నాగుల సత్యం, సంజీవ్ రెడ్డి, కొండల్ రెడ్డి, నూర్, జావీదుద్దిన్, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, సత్యమ్మ, లక్ష్మి, సన్నజాజుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed