- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం : అమిత్ షా

దిశ, నాచారం : బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కుంభకోణాలలో మునిగి పోయిందని.. రానున్న రోజుల్లో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం నాచారం లో జరిగిన రోడ్ షో కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ తో కలిసి నాచారం హెచ్ఎంటి సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి ఓపెన్ టాప్ జీపు పై రోడ్ షోలో పాల్గొన్నారు. అడుగడుగునా కార్యకర్తలు నాయకులు జననీరాజనాలు పలికారు. అమిత్ షా కార్యకర్తలు అభిమానులు పై పూల వర్షం కురిపించారు. అమిత్ షా కూడా కార్యకర్తలపై పూలు చల్లారు. అనంతరం నాచారం విలేజ్ వద్ద జనవాహిని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు.
కేసీఆర్ అవినీతి, కుంభకోణాల్లో కూరక పోయాడని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసీఆర్ ను, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో ఉంచుతామన్నారు. ఉచితంగా నాలుగు సిలిండర్లు అందజేస్తామని తెలిపారు. పేదలకు ప్రోత్సాహకరంగా రూ.10 లక్షలు అందజేస్తామని చెప్పారు. అలాగే వైద్య సదుపాయం, ఆస్పత్రుల కోసం బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రైతులకు సబ్సిడీ, మహిళలకు ప్రోత్సాహకాలు అందజేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఓవైసీ డ్రామా కంపెనీ ల కాలం చెల్లిందని.. కేసీఆర్ ను గద్దె దించాలని అమీషా పిలుపునిచ్చారు. మళ్లీ కాబోయే ప్రధాని మోదీ నేనని.. రాష్ట్రంలో కూడా అధికారం చేపడుతుందని జోష్యం చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ ను గెలిపించాలని అమిత్ షా కోరారు.
- Tags
- amit shah