జర దేకో డిప్యూటీ కమిషనర్ సాబ్

by Kalyani |
జర దేకో డిప్యూటీ కమిషనర్ సాబ్
X

దిశ ఉప్పల్: ఉప్పల్ భగాయత్ లో అక్రమ నిర్మా ణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అక్రమార్కులు ఇష్టారాజ్యంగా అక్రమ షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం నిద్రమత్తులో మునిగిపోతున్నరని విమర్శలు వెలువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు జరగకుండా చూసుకోవాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని అక్రమ నిర్మాణాలకు అజ్యం పోస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.ఉప్పల్, చిల్కానగర్,రామంతాపూర్,హబ్సిగూడ ప్రాంతాల్లో అడ్డగోలుగా అక్రమ షెడ్ల నిర్మాణం జరుగుతున్న కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.

ఉప్పల్ భగాయత్ ప్రధాన రహదారిలో ఎలాంటి అనుమతి లేకుండా భారీ అక్రమ షెడ్ నిర్మాణం జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఉప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఏ నిర్మాణం చేపట్టిన అనుమతులు తప్పనిసరి. కానీ అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా టౌన్ ప్లానింగ్ చైన్ మెన్ల అండ దండలతో అక్రమ షెడ్లు నిర్మిస్తున్నారు.దీంతో మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడుతుంది.

అయినప్పటికీ దాన్ని ఆచరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప అక్రమ షెడ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. యదేఛ్చగా అక్రమ నిర్మాణాలు జరుపుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ కమిషనర్ సాబ్ చొరవ తీసుకోని అక్రమ నిర్మా ణాలను కూల్చివేసి, నిర్మాణదారులపై కఠిన చర్య లు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story

Most Viewed