పదేళ్లలో భారత్ ప్రతిష్ట పెరిగింది : Etela Rajender

by Disha Web Desk 23 |
పదేళ్లలో భారత్ ప్రతిష్ట పెరిగింది : Etela Rajender
X

దిశ, మేడ్చల్ బ్యూరో : పదేళ్ల బీజేపీ పాలనలో భారత దేశ ప్రతిష్ట బాగా పెరిగిందని,ఇతర దేశాల్లో ఉండే మనవారికి గౌరవం దక్కుతుందని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం గాజులరామారం లో రాంకీ వన్ మార్వెల్ అపార్ట్ మెంట్ అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఇతర దేశాలపైన మన ఆదారపడే వాళ్లమని తెలిపారు. కానీ పదేళ్ల మోడీ పాలనలో ఇతర దేశాలు మన వైపు చూస్తున్నాయని అన్నారు. బీజేపీ కేవలం జై శ్రీరాం అని చలామణి కావడం లేదన్నారు.. రాముని పేరు మీద ఓట్లు అడుగుతున్నారని కొందరు అవాకులు చెవాకులు పేల్చుతున్నారని మండి పడ్డారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పార్టీలు, నాయకులు నడుచుకోవాలని హితువు పలికారు. బీజేపీ పార్టీ అలా నడుచుకున్నందునే ప్రజల ఆరాధ్య దైవం అయిన రామునికి అయోధ్యలో గుడికట్టించిదని, ప్రతి ఇంటికి అక్షింతలు పంపించారని రాజేందర్ వివరించారు.

ఎన్నో కీలక నిర్ణయాలు..

జమ్మూ కాశ్మీర్ లో ఉన్న 370 ఆర్టికల్ రద్దు చేసిన ఘనత మోడీదేనన్నారు. లాల్ చౌక్ లో జెండా ఎగురవేయాలి అంటే చచ్చిపోవాల్సిందే నని, కానీ ఈరోజు స్వతంత్రంగా ఎరుగవేస్తున్నామని తెలిపారు.ఇప్పుడు చైనా బజార్ లు బంద్ అయ్యి.. మేడ్ ఇన్ ఇండియా బజార్ లు వెలుస్తున్నాయని తెలిపారు. తుపాకుల నుంచి మిస్సైల్స్ వరకు అన్నీ భారత్ లోనే తయారవుతున్నాయని అన్నారు. ప్రధాని మోడీ ఏడాదిలో 365 రోజులు పని చేస్తున్నారని, ఒక్కనాడైనా జ్వరం వచ్చిందని పడుకో లేదన్నారు. కరోనా సమయంలో ప్రకృతి కన్నెర్ర చేస్తే వణికిపోయారు. దేవుడా.. కాపాడు అని మొక్కుకున్నారు. అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది.. హామీలు అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఈటల ద్వజమెత్తారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు మల్లారెడ్డి, గిరి వర్ధన్ రెడ్డి, భరత్ సింహారెడ్డి అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రసాద్, అభినవ్, రఘు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed