ఆ దవాఖాన్లను మూసేస్తం.. డాక్టర్ పుట్ల శ్రీనివాస్

by Disha Web Desk |
ఆ దవాఖాన్లను మూసేస్తం.. డాక్టర్ పుట్ల శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : చట్ట విరుద్ధంగా దవాఖాన్లను నడిపిస్తే మూసివేస్తామని డీఎంహెచ్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పుట్ల శ్రీనివాస్ హెచ్చరించారు. చిన్నపాటి క్లినిక్‌లు, దవాఖానాలు, డయాగ్నస్టిక్ కేంద్రాలకు అర్హత లేకుంటే నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అర్హత లేని వాళ్లను డాక్టర్లుగా కొనసాగిస్తే క్రిమినల్ కేసులు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో గురువారం నుంచి ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు లేకుండా కొనసాగుతున్న దవాఖాన్లన్నింటిని సీజ్​చేస్తామన్నారు. రూల్స్‌కు విరుద్ధంగా అన్​క్వాలిఫైడ్ స్టాఫ్‌తో పనిచేయిస్తుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్స్‌, క్లినిక్స్‌ కన్సల్టేషన్‌ రూమ్స్‌, పాలీ క్లినిక్కులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, ఫిజియోథెరపీ యూనిట్స్‌, డెంటల్‌ ఆస్పత్రులపై ఫోకప్​పెడుతున్నామని చెప్పారు. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్టు అమలు కాని ఆసుపత్రుల అనుమతులు రద్దు చేస్తామని ఈ సందర్భంగా డీఎమ్ హెచ్ ఓ వెల్లడించారు.Next Story