రంజాన్​ వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి మహమూద్ అలీ..

by Disha Web Desk 11 |
రంజాన్​ వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి మహమూద్ అలీ..
X

దిశ, కూకట్​పల్లి: కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను సోదర భావంతో నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలోని కేపీహెచ్​బీకాలనీలో నూతనంగా నిర్మించిన ఈద్గా ప్రారంభోత్సవ, రంజాన్​ వేడుకలలో హోంమంత్రి మహమూద్​ అలీ, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈద్గా ప్రారంభోత్సవ కార్యక్రమ అనంతరం రంజాన్​ నమాజ్​ను నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ అందరూ సోదర భావంతో కలిసి మెలిసి పండుగలను జరుపుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ సీఎం కేసీఆర్​ కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.

రంజాన్​ సందర్భంగా పేద ముస్లింలకు రంజాన్​ కానుకలను పంపిణీ చేయడంతో పాటు ఇఫ్తార్​ విందును అందిస్తున్నారని అన్నారు. కూకట్​పల్లి ప్రజలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అండగా ఉండి ఈద్గాను నిర్మించి ఇవ్వడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నగరంలో ఎక్కడా లేని విధంగా కేపీహెచ్​బీకాలనీలో ఈద్గాను నిర్మించి అన్ని వసతులు కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందాడి శ్రీనివాస్​ రావు, పండాల సతీష్​ గౌడ్​, జిల్లా మైనారిటి విభాగం అధ్యక్షుడు గౌసుద్దీన్, మాజీ కార్పొరేటర్​ బాబురావు, డివిజన్​ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed