భవిష్యత్ అంతా మహిళలదే: మంత్రి మల్లారెడ్డి

by Disha Web Desk 11 |
భవిష్యత్  అంతా మహిళలదే: మంత్రి మల్లారెడ్డి
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మహిళలకు బంగారు భవిష్యత్ ఉందని, రాబోయే రోజుల్లో మహిళ రిజర్వేషన్లు పెరగనున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మహిళ రిజర్వేషన్లు పెరిగినట్లయితే సర్పంచ్ లు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మహిళలే అవుతారని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని మంగళవారం జిల్లా పరిషత్ హాల్ లో నిర్వహించిన మహిళ సంక్షేమ దినోత్సవ సంబురాలు వైభవంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. మహిళా సంక్షేమం కోసం ఒంటరి మహిళలకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్, మహిళలకు వీ–ఎల్గర్, షీ– టీమ్స్, వీ– హబ్ ఏర్పాటు, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు పెంచారని ఇదే మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమని మంత్రి మల్లారెడ్డి వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, సెర్ఫ్, ఇతర మహిళా ఉద్యోగులకు మంచి వేతనాలు అందించడంతో పాటు వారికి తగిన గౌరవాన్ని ఇస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళాభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాలు రాగా జ్యోతి, జడ్పీ సీఈఓ దేవ సహాయం, కీసర ఆర్డీఏ రవి, ఎంపీపీలు రజిత రాజా మల్లారెడ్డి, ఎల్లుబాయ్, హారిక మురళి గౌడ్, జడ్పీటీసీ శైలజ విజేయందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Read more:

‘కేసీఆర్ మీటింగ్‌కు పిలిచి గొడ్డుకారంతో భోజనం’ (వీడియో)

Next Story

Most Viewed