ఫేక్ పీసీసీ సర్టిఫికెట్ కలకలం…సీపీ సీరియస్

by Kalyani |
ఫేక్ పీసీసీ సర్టిఫికెట్ కలకలం…సీపీ సీరియస్
X

దిశ, నవీపేట్ : పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం ఏకంగా నిజామాబాద్ మాజీ పోలీసు కమిషనర్ సంతకంతో కూడిన ఫేక్ సర్టిఫికెట్ తయారు చేసిన ఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. ఓ ముఠా ఐపీఎస్ ఫోర్జరీ సంతకాలతో పోలీసు అధికారులను బురిడీ కొట్టించిన వ్యవహారంపై సీపీ కల్మేశ్వర్ సీరియస్ కావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి... నవీపేట్ మండలం పోతంగల్ కు చెందిన మగ్గిడి అనిల్ కుమార్ అనే వ్యక్తికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ) అవసరం ఉండగా,నిజామాబాద్ కు చెందిన దరి సింగ్, ఆర్మూర్ కు చెందిన డినకర్ లను సంప్రదించాడు.

దినకర్ దొడ్డిదారిలో పీసీసీ పత్రాన్ని సృష్టించి మాజీ ఐపీఎస్, ప్రస్తుత వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్.నాగరాజు సంతకంతో కూడిన ఫేక్ పీసీసీ సర్టిఫికెట్ ను తయారు చేశారు. ప్రస్తుతం సీపీగా కల్మేశ్వర్ ఉండడం, సంతకంలో తేడా గుర్తించిన స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఈ విషయాన్ని నవీపేట్ పోలీసులకు సమాచారం అందించారు. మగ్గిడి అనిల్ కుమార్ ఫిర్యాదు మేరకు సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి నిందితుడిని పట్టుకొని విచారిస్తున్నట్లు నవీపేట్ ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. సదరు నిందితులు గతంలో ఇలాంటివి తయారు చేసి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఏకంగా పోలీసు ఉన్నతాధికారి సంతకంతో ఫేక్ సర్టిఫికెట్ తయారుచేసి ఇవ్వడం పోలీసు వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.Next Story

Most Viewed