రాచకొండ సీపీపై కోడ్ పిడుగు.. బదిలీ అంటూ జోరుగా చర్చ..

by Disha Web Desk 23 |
రాచకొండ సీపీపై కోడ్ పిడుగు.. బదిలీ అంటూ జోరుగా చర్చ..
X

దిశ, రాచకొండ : రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఫై ఎలక్షన్ కమిషన్ కోడ్ ఓ పిడుగులా తయారైంది. దీని పై ఇప్పుడు కమిషనరేట్ పరిధిలో జోరుగా చర్చ జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ గత నెలలో ఎలక్షన్లు జరుగుతున్న రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లకు మార్గదర్శకాలను పంపించింది. ఇందులో జూన్ 30, 2024 వరకు నాలుగు సంవత్సరాల గడువు కాలం లో ఒకే చోట 3 ఏండ్లు విధులు నిర్వహించే వారిని బదిలీ చేయాలని సూచించింది. దీంతో రాచకొండ కమిషనరేట్ లో జాయింట్ సీపీ, అదనపు పోలీసు కమిషనర్ గా 2018 ఏప్రిల్, నుంచి జాయింట్ సీపీ, అదనపు సీపీ గా జనవరి 2023 వరకు పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ గా బదిలీ అయ్యారు. తిరిగి 2023 డిసెంబర్ 13 న రాచకొండ పోలీస్ కమిషనర్ గా తిరిగి బాధ్యతలు చేపట్టారు.

ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం నాలుగు సంవత్సరాల గడువును తీసుకుంటే 2020 నుంచి పనిచేసిన రోజులను లెక్కిస్తున్నారు. అలా లెక్కించినప్పుడు సీపీ సుధీర్ బాబు 3 ఇయర్స్ నిబంధనకు 15-20 రోజులు తేడా వస్తుందని సమాచారం. అంటే ఎలక్షన్ నిబంధనలకు మూడు సంవత్సరాలు పూర్తి అయ్యి 15-20 రోజులు పని చేస్తున్నట్లు పోలీసుల రికార్డ్స్ స్పష్టం చేస్తున్నాయని పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్. ఈ కారణంగా ఇప్పుడు సీపీ సుధీర్ బాబు ఫై ట్రాన్స్ఫర్ పిడుగు పడుతుందని చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 50 రోజులుగా సీపీ గా ఉన్న సుధీర్ బాబు ఇంత తొందరగా బదిలీ అవుతున్నారని ప్రచారం సాగుతుండటంతో కొత్త సీపీ ఎవరనేది ఆసక్తిగా మారింది. లేదా నిబంధనలు ఏమైనా అనుకూలించి, సుధీర్ బాబు పోలీసుల సేవలను మెరిట్ కింద తీసుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనను సీపీ గా కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

Read More..

బెల్లంపల్లిలో గంజాయితో పట్టుబడ్డ యువకులు..



Next Story

Most Viewed