శ్రీ చైతన్య స్కూల్ ముందు బడ్జెట్ పాఠశాల యాజమాన్యాల ధర్నా

by Mahesh |
శ్రీ చైతన్య స్కూల్ ముందు బడ్జెట్ పాఠశాల యాజమాన్యాల ధర్నా
X

దిశ, పేట్ బషీరాబాద్: అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ ముందు బడ్జెట్ పాఠశాల యాజమాన్యాలు ధర్నా నిర్వహించాయి. కుత్బుల్లాపూర్ మండలం సుచిత్ర మూడు గుళ్ళు ఎదురుగా శ్రీ చైతన్య పాఠశాల కు అనుమతులు లేకపోవడంతో మే నెలలో విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. అయినప్పటికీ పాఠశాల యాజమాన్యం అడ్మిషన్ స్వీకరిస్తూ.. విద్యార్థులను చేర్చుకుంటుంది. ఈ విషయంపై ఇప్పటికే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. అయితే బుధవారం నుంచి పాఠశాల ప్రారంభం చేస్తున్నామంటూ శ్రీ చైతన్య స్కూల్ మెసేజ్లు పెట్టడంతో కుత్బుల్లాపూర్ బడ్జెట్ స్కూల్ యాజమాన్య సంఘం పాఠశాల ముందు ధర్నా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ వైఖరిని ఎండ కట్టారు.Next Story

Most Viewed