కాసాని చేరికతో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ : కేపీ వివేకానంద

by Disha Web Desk 23 |
కాసాని చేరికతో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ : కేపీ వివేకానంద
X

దిశ,కుత్బుల్లాపూర్: రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ సూచనలు సలహాలు మేరకు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. బహదూర్ పల్లి మేకల వెంకటేశం గార్డెన్ లో సోమవారం జరిగిన కాసాని జ్ఞానేశ్వర్ సన్మాన సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయిన కాసాని జ్ఞానేశ్వర్ ఆ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి రావడంతో పార్టీకి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించనున్నదని అన్నారు.

ఆయన రాకతో రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా నిలిచిందని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని కొనియాడారు. విద్యావంతుడైన వివేకానంద ను నియోజకవర్గం లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త అభిమానులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఇతర ప్రజాప్రతినిధులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ని గజమాలతో సత్కరించారు.

Next Story