పోలియో రహిత సమాజానికి కృషి : ఎమ్మెల్యే

by Naresh N |
పోలియో రహిత సమాజానికి కృషి : ఎమ్మెల్యే
X

దిశ, పటాన్‌ చెరు: చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించాలని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తల్లిదండ్రులను కోరారు. ఆదివారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్ల పోలియో చుక్కల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.Next Story

Most Viewed