పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష: ఎమ్మెల్యే కె.మాణిక్ రావు

by Disha Web Desk 1 |
పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష: ఎమ్మెల్యే కె.మాణిక్ రావు
X

దిశ, జహీరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అని, వారిని కంటికి రెప్పలా కాపడుకుంటామని ఎమ్మెల్యే కె.మాణిక్ రావు అన్నారు. శనివారం డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివ కుమార్ తో కలిసి న్యాల్కల్ మండల పరిధలోన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు భారీ గజమాల డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మరోసారి అధికారం తమదేనంటూ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు.

కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ అభివృద్ధి-సంక్షేమ పథకాలని వివరించాలని నాయకులకు సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి, చైతన్య పరిచేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. ఇందులో భాగంగా న్యాల్కల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఆమన తెలపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయన్నాయని పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా మంచి నీటి సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. ఒంటరి మహిళ, బీడీ కార్మికులు, వృద్ధులకు వికలాంగులుకు ఆసరా పింఛన్లు అందిస్తున్నామన్నారు. కళ్యాణా లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో అడబిడ్డల పెళ్లికి ఆర్ధిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. గురుకుల పాఠశాలలతో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు రవీందర్, ఎంపీపీ అంజమ్మ, జడ్పీటీసీ స్వప్న భాస్కర్, వైస్ ఎంపీపీ గౌస్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మెంబర్ బంటు రామకృష్ణ, మాజీ మండలాధ్యక్షుడే నర్సింహ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు రవి ముదిరాజ్, మండల మైనారిటీ అధ్యక్షుడు హనీఫ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ లు మారుతి యాదవ్, సునీల్, భూమా రెడ్డీ, వీరారెడ్డి, శివశంకర్ స్వామి, రాజు, యూనిస్ పటేల్, రవి, మజీద్ పటేల్, శేఖర్ రెడ్డి, మచ్చేందర్, అమీర్, మల్ రెడ్డి, ఎంపీటీసీ సిద్దమ్మ, శ్రీపతి శివానంద, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed