ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టాలి: కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

by Disha Web Desk 1 |
ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టాలి: కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుడా కార్యాలయంలో పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి పొన్నాల, వేములవాడ కమాన్ ప్రధాన రహదారి వెంట పుట్ పాత్ పై మోడ్రన్ లైట్లను అమర్చాలని సూచించారు.

పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా హౌసింగ్ బోర్డు కమాన్ నుండి ఎన్సాన్ పల్లి రోడ్డు వరకు ఉన్న రోడ్డును నాలుగు వరసల రహదారి నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కప్పల కుంట చెరువు, మచ్చ వాయుకుంట చెరువు సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అనంతరం హౌసింగ్ బోర్డు కమాన్ నుండి ఎన్సాన్ పల్లి రోడ్డును, మిట్టపల్లి శివారులో నిర్మించబోతున్న మాడ్రన్ లేఔట్ ప్రాంతాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సుడా వైస్ చైర్మన్ రమణాచారి, మున్సిపాల్ కమిషనర్ సంపత్ కుమార్, మాజీ మున్సిపాల్ చైర్మన్ కడవేరు రాజనర్సు, ఈ ఈ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed