మెదక్ జిల్లాలోనే ఏసీబీ దాడులు ఎందుకు..!?

by Mahesh |
మెదక్ జిల్లాలోనే ఏసీబీ దాడులు ఎందుకు..!?
X

దిశ, మెదక్ ప్రతినిధి: ఇసుక ట్రాక్టర్ పట్టుకొని వదిలేందుకు డబ్బులు డిమాండ్ చేసిన కేసులో ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయిన ఘటన మరవకముందే జిల్లాలో ఇసుక కేసులో మరో ఎస్ఐ ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ లేని విధంగా జిల్లాలో ఏసీబీ దాడులు జరగడం అధికారులు జైలు పాలు కావడంపై జిల్లా బాస్ ల అజమాయిషీ పై అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ లో అవుసుల పల్లి కి చెందిన ఇసుక ట్రాక్టర్ ను పట్టుకుని రిలీజ్ చేసేందుకు రూ.15 వేలు డిమాండ్ చేసి సురేందర్ అనే కానిస్టేబుల్ మార్చి 19 న ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ కేసులో అందులో ప్రమేయం ఉన్న ఎస్ఐ అమర్, రైటర్ పాషా కూడా ఉన్నట్టు ఏసీబీ విచారణలో తేలడంతో ఎస్ఐలతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు.

జిల్లాలో పోలీసు శాఖలో ఏసీబీ దాడి జరిగి నాలుగు నెలలు గడవక ముందే హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై ఆనంద్ మధ్యవర్తి ద్వారా రూ.20 వేలు డబ్బులు తీసుకుని పట్టుబడటం జిల్లాలో కలకలం రేపింది. మెదక్ పట్టణానికి చెందిన పూల గంగులు అనే వ్యక్తి ఇసుక టిప్పర్ ను సీజ్ చేసిన కేసులో టిప్పర్ రిలీజ్ కు 50 వేలు డిమాండ్ చేసి రూ.20 వేలకు ఒప్పందం కుదుర్చుకొని మస్తాన్ అనే మధ్యవర్తి ద్వారా సోమవారం హవేలీ ఘనపూర్ సమీపంలోని పెట్రోల్ పంప్ వద్ద తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం చర్చకు దారితీస్తోంది. వారి వైఫల్యం మూలంగా అధికారులు అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.

గుణపాఠం నేర్వని ఖాకీలు..

ఇసుక వ్యవహారంలో పోలీస్ శాఖ తీరుపై అనేక విమర్శలు వస్తున్న మార్పు రావడం లేదు. జిల్లాల్లో అంతటా అవినీతి జరుగుతున్న శాఖలు ఎన్నో ఉన్నా ఎందుకు పోలీసులు మాత్రమే చిక్కుతున్నారంటే ఇందుకు ప్రధాన కారణం ఇసుకలో వ్యాపారులు ప్రతి నెలా కొంత మందికి మామూళ్ళు ఇస్తారన్న ప్రచారం ఉంది. ఒక స్టేషన్ లో మామూళ్ళు ఇచ్చి మరో స్టేషన్ లో చిక్కినప్పుడు కేసు నమోదు అయితే బాదితులు అడిగినంత ఇవ్వలేక ఏసీబీ నీ ఆశ్రయించి పట్టిస్తున్నారు. జిల్లాలో పక్కా పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటనే నాలుగు నెలల్లో పునరావృతం అయిందంటే ఆ శాఖ నేర్చుకున్న గుణపాఠం ఏమిటో తెలియనిది కాదు. ఇసుక ఇసుక వ్యాపారం అంటే అవినీతికి చిహ్నంగా మారింది. నిత్యం అక్రమ వ్యాపారం జరుగుతున్న మామూళ్ల మత్తులో మౌనం ఖాకీ మెడకు చుట్టుకుంటుంది.

మారకుంటే.. జిల్లాలో కష్టమే..

ఇసుక, మట్టి దందా ను పూర్తిగా అడ్డుకట్ట వేయకుంటే ఖాకీ అవినీతి నుంచి బయటపడే అవకాశం లేదు. జిల్లాలో ప్రతి మండలంలో ఇసుక, మట్టి దందా యదేచ్ఛగా సాగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా జిల్లా అధికారులు స్పందించకపోవడం వల్లనే బాధితులు ఏసీబీ నిరస్రేయించాల్సిన దుస్థితి వస్తుంది. పోలీసులు సీజ్ చేసిన ఇసుక, మట్టి ట్రాక్టర్ లు విడుదల చేయడం లో నిబంధనలు పాటించడం లేదని విమర్శలు ఉన్నాయి. ఏదైనా ఇసుక, మట్టి వాహనం సీజ్ చేస్తే భారీగా డబ్బులు డిమాండ్ చేయడంతో అడిగింతా ఇవ్వలేక బాదితులు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్ ల పై పర్యవేక్షణ పెంచి అవినీతి అధికారులపై నిఘా పెంచితే కొంతమేరకైనా అవినీతిని అరికట్టే అవకాశం ఉంటుంది. గతంలో మాదిరిగా ఈ సారి కూడా వదిలేస్తే.. మళ్ళీ మరో పోలీస్ స్టేషన్ లో కూడా అలాంటి దాడులు చూసే అవకాశం ఉండేందుకు ఆస్కారం ఉంటుంది..

Next Story

Most Viewed