ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీ కొట్టిన టిప్పర్

by Disha Web |
ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీ కొట్టిన టిప్పర్
X

దిశ, హత్నూర: హత్నూర మండలం లోని రెడ్డి ఖానాపూర్ గ్రామ శివారులో ఒకపక్కన మామిడి చెరువులో నుండి నల్లమట్టి వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసిన వ్యవహారం తెలిసినదే.. మరోపక్క మట్టి టిప్పర్లు ఇష్టానుసారంగా అతి వేగంగా నడపడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.ఈరోజు ద్విచక్రవాహనాన్ని మట్టి టిప్పర్ లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి ఖానాపూర్ దౌల్తాబాద్ రోడ్డుపై శనివారం రాత్రి చోటు చేసుకుంది రెడ్డి ఖానాపూర్ గ్రామానికి చెందిన సురేష్, గుడాల పోచమ్మ,కుమ్మరి చంద్రకళలు బైక్ పై దౌల్తాబాద్ నుంచి రెడ్డి ఖానాపూర్ గ్రామానికి వెళ్తుండగా దౌల్తాబాద్ వైపు మట్టి లోడుతో ఎదురుగా వస్తున్న టిప్పర్ బలంగా ఢీ కొట్టింది.


ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న పోచమ్మ చెయ్యి విరిగిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై అతి వేగంగా,అజాగ్రత్తగా నడుపుతూ ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను, టిప్పర్‌ను అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న గ్రామస్తులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Next Story