ఆలయంలో చోరీ..

by Aamani |
ఆలయంలో చోరీ..
X

దిశ,టేక్మాల్ : టేక్మాల్ మండల పరిధిలోని బొడ్మట్ పల్లి వీరభద్రాలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు చొరబడి అమ్మవారి ముక్కు పుడక, తాళి బొట్టు, వీరభద్రుని వెండి తిలకం, వెండి కళ్ళు, చోరీ చేశారు. ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్ పాటిల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి సీసీ పుటేజీలను పరిశీలించారు. గత నెల 23న రాత్రి సైతం ఆలయ హుండీని పగులగొట్టే ప్రయత్నం చేసిన,వారి ప్రయత్నంలో విఫలం అయ్యారు. తిరిగి జూలై 1 రాత్రి ముగ్గురితో చోరికి పాల్పడినట్టు లీప్ పుటేజీల్లో కనిస్తుంది. ఆలయాల్లో చోరీకి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

Next Story