పేదల సంక్షేమమే.. సీఎం కేసీఆర్ ధ్యేయం: మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 1 |
పేదల సంక్షేమమే.. సీఎం కేసీఆర్ ధ్యేయం: మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్ లో రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ నిరుపేద ముస్లింలకు కానుకలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దసరా, క్రిస్మస్, రంజాన్ పండగలను ప్రతి ఒక్కరూ అనందంగా జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. అయా పండగలకు ప్రభుత్వమే అధికారికంగా బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందని వివరించారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పేదల గురించి అలోచన చేసిన సందర్భాలు లేవన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.

మైనారిటీ విద్యాభివృద్ధే ధ్యేయంగా మైనారిటీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్చచ్ఛ సిద్దిపేటలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో స్పెషలిస్టు డాక్టర్ల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాల వారు సిద్దిపేటలోని పర్యటక ప్రాంతాలను చూసివెళ్లేలా అభివృద్ధి చేసినట్లు వివరించారు.

ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ మాట్లాడుతూ.. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ నాయకులు పూజల వెంకటేశ్వర్ రావు, మచ్చ.వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు రియాజ్, మోయిజ్, వజీర్, ఆర్టీఏ మెంబర్ ఇర్షద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed