వీధి కుక్కల ఎఫెక్ట్.. ఆ విలేజ్‌లో అలర్టైన గ్రామస్తులు!

by Disha Web Desk 11 |
వీధి కుక్కల ఎఫెక్ట్.. ఆ విలేజ్‌లో అలర్టైన గ్రామస్తులు!
X

దిశ, మనోహరాబాద్: ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన తెలిసిందే. రాష్ర్టంలో ప్రజలు వీధి కుక్కల బారిన పడకుండా అలర్ట్ అవుతున్నారు. అందులో భాగంగానే నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మనోహరాబాద్ మండల పరిధి కాళ్ళకల్ గ్రామంలో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, రాత్రి వేళలో పరిశ్రమల నుంచి వచ్చే కార్మికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఈ విషయంపై గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశారు. కుక్కల నివారణ కోసం తూప్రాన్ వెటర్నరీ డాక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని కాళ్ళకల్ గ్రామ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, ఉప సర్పంచ్ రాజు యాదవ్, కార్యదర్శి శంకర్ గౌడ్ లు తెలిపారు. త్వరలోనే వీధి కుక్కల నివారణకు చర్యలు చేపడతామని చెప్పారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed