రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి : మంత్రి హరీష్ రావు

by Vinod kumar |
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి : మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లాలో, రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదాల పై హైదరాబాద్ బీఆర్ కే భవన్ లో ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామీణ రోడ్ల నుంచి రాష్ట్ర, జాతీయ రహదారులపై వచ్చే రూట్లతో బ్లాక్‌స్పాట్ల, ప్రమాదాలు జరిగినప్పుడు వైద్య సాయం అందించే ట్రామా కేర్ సెంటర్లపై చర్చించారు.

దీంతో పాటు సిద్ధిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రహదారుల వెంట ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సమాచారాన్ని ప్రభుత్వ పోర్టల్ లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. సిద్ధిపేట, ఒంటిమామిడి జంక్షన్, ప్రజ్ఞాపూర్ జంక్షన్‌లలో స్పీడ్ ఇండికేటర్లను ఏర్పాటు చేసి ప్రయాణీకులకు అవగాహన కల్పించాలని, రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ జంక్షన్, డబుల్ బెడ్రూం ఇళ్ల వైపు వెళ్లే రూట్ లో సర్వీస్ రోడ్లు నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, ఆర్ అండ్ బీ గణపతి రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, సిద్ధిపేట పోలీస్ కమిషనర్, రోడ్డు సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed