స్పౌస్ పాయింట్లను తొలగించాలి..

by Disha Web Desk 1 |
స్పౌస్ పాయింట్లను తొలగించాలి..
X

పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఉపాధ్యాయులు

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఉపాధ్యాయ బదిలీల్లో స్పౌస్ పాయింట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నాన్ స్పౌస్ టీచర్స్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పద్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్పౌస్ పాయింట్లు తొలగించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు దేవసేనలకు పోస్ట్ కార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ.. పరిపాలన సౌలభ్యం కోసం పది జిల్లాలను ౩౩ జిల్లాలుగా మార్చడంతో జిల్లాల పరిధి తగ్గిందని అలాంటప్పుడు స్పౌస్ పాయింట్లు అవసరం లేదని, తొలగించాలని కోరారు. భార్యా, భర్తలైన ఉద్యోగులు ఇద్దరినీ ఒకే చోట ఉంచాలనుకున్నప్పుడు స్పౌస్ పాయింట్లు అవసరం లేదన్నారు. అదేవిధంగా వారిని ఎక్కడైనా ఒకేచోట ఉంచవచ్చన్నారు. నాన్ స్పౌస్ జీవిత భాగస్వామి వ్యవసాయం, ఇతర స్థలాలు మార్చడానికి వీలుకాని వృత్తిలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగిని తన భాగస్వామి దగ్గరకు సర్దుబాటు చేయాలన్నారు.

స్పౌస్ లకు ప్రభుత్వం రివర్స్ స్పౌస్ అవకాశం ఇస్తే వినియోగించుకోలేని వారికి 10 పాయింట్లు అవసరం లేదన్నారు. స్పౌస్ పాయింట్లు తొలగించి నాన్ స్పౌస్ ఉద్యోగులకు న్యాయం చేయాలని పోస్ట్ కార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవరుషి, రామస్వామి, జనార్ధన్ రెడ్డి, భిక్షపతి, మల్లారెడ్డి, రామస్వామి, సాదత్ అలి, శ్రీనివాస్, సురేష్ కుమార్, గణపతి, వెంకట నరసింహులు, నాగేందర్, రమేష్, రాజేందర్, బాలకిషన్, రవీందర్, తిరుమలేశ్, రాంగోపాల్ రెడ్డి, శ్రీకాంత్, విటల్, గణేష్, పద్మ, సుజాత, లలిత, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed