తరగతి గదిలో నుంచే మేధావులు వస్తారు: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Dishanational1 |
తరగతి గదిలో నుంచే మేధావులు వస్తారు: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, మెదక్ ప్రతినిధి: బావి భారత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమం వెస్లీ పాఠశాలలో శనివారం జరిగింది. విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిట్లను పరిశీలించిన అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిట్లు ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా మేథస్సును ఉపయోగించి తయారుచేసినవాటిని ఆధునికరిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. శాస్త్రవేత్తలు ఎక్కడినుంచో రారని తరగతి గదిలో నుంచి పుట్టుకొస్తారని అన్నారు. వైజ్ఞానిక రంగంలో విద్యార్థులు దేశస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గత శాస్త్రవేత్తల ఆలోచనకు ప్రతిబింబాలే మనం ఇప్పుడు వినియోగిస్తున్న పరికరాలు అన్నారు. ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో వేగంగా పరుగుపడుతుందని, అదేవిధంగా విద్యార్థుల ఆలోచన కూడా అదేవిధంగా ఉండాలని సూచించారు. 506 ఎగ్జిబిట్లు ప్రదర్శనకు రావడం సైన్స్ పట్ల విద్యార్థులకు ఉన్న ఆసక్తిని చూపిస్తుందన్నారు. ఉపాధ్యాయులు మరింత ప్రోత్సహించి జాతీయస్థాయిలో వారి ప్రదర్శన ఉండేలా తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రగోతం రెడ్డి, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.





Next Story

Most Viewed