- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ధాన్యం తూకంలో మోసాలను అరికట్టాలి: మంజీరా రైతు సమాఖ్య
దిశ, సదాశివపేట: రైతులు పండించిన పంట ధాన్యం తూకంలో మోసాలను అరికట్టాలని మంజీరా రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి పృథ్విరాజ్ డిమాండ్ చేశారు. శనివారం సదాశివపేటలోని స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పత్తి పంటకు సరైన ధర లేక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి వ్యాపారులంతా సిండికేట్ గా ఏర్పడి వారు నిర్ణయించిన ధరకే కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. పత్తి మిల్లులతోపాటు బయట రోడ్ల పక్కన ఫుట్ పాత్ వద్ద కొంతమంది పై కొంతమంది దళారులను ఏర్పాటు చేసుకుని రైతుల వద్ద పత్తి పంటను కొనుగోలు చేస్తున్నారన్నారు.
దళారులు తూకంలో మోసం చేస్తూ ఇష్టం వచ్చిన రేట్లు నిర్ణయించి రైతుల నష్టాలకు కారకులవుతున్నారన్నారు. సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తూ అక్రమ వ్యాపారాలు చేస్తున్నవారికి అండగా నిలుస్తున్నారని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలులో క్వింటాల్ కు 100 రూపాయలు చొప్పున కట్ చేసి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గణపతి షుగర్ ఫ్యాక్టరీ క్రషర్ ను త్వరగా ప్రారంభించి చెరుకు రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతు కష్టాన్ని మార్కెట్లో అధికారులు, వ్యాపారుల మధ్య దళారులు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. వెంటనే అధికారులు రైతులకు జరుగుతున్న మోసాలను అరికట్టాలని లేదా మంజీరా రైతు సమాఖ్య ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో రైతు సమైక్య నాయకులు సంగిశెట్టి, సంగమేష్, శశిధర్, మహేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
- Tags
- medak
- rice grain