లీకు వీరుడు.. కేటీఆర్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్

by Disha Web Desk 1 |
లీకు వీరుడు.. కేటీఆర్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : టీ.ఎస్.పీ.ఎస్.సీ ప్రశ్నా పత్రాల లీకు వీరుడు మంత్రి కేటీఆర్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. టీ.ఎస్.పీ.ఎస్.సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి నిరసనగా 11న సంగారెడ్డి లో నిర్వహించ తలపెట్టిన ఉమ్మడి మెదక్ జిల్లాల నిరుద్యోగ మార్చ్ సన్నహాక సమావేశం మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలోని నిరుద్యోగులకు కన్నీళ్లే మిగిలాయన్నారు. టీ.ఎస్.పీ.ఎస్.సీ ప్రశ్నా పత్రాల లీకేజీతో ప్రభుత్వ ఉద్యోగం సాధనే లక్ష్యంగా రాత్రింబవళ్లు కష్టపడి చదువుకున్న 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రశ్నా పత్రాల లీకేజీ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్నారు. అదేవిధంగా లీకేజీతో నష్టపోయిన అభ్యర్థులకు రూ.1 లక్ష నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం స్లీపర్ సెల్స్ కు అండగా మారిందన్నారు.

ఇతర రాష్ట్రాల పోలీసులు హైదరాబాద్ లో దాడులు నిర్వహించి ఉగ్రవాదులను పట్టు కున్నారని ఎద్దేవా చేశారు. భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, ఇంటలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. నిరుద్యోగుల అకంక్షల సాధనే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ మార్చ్ లో నిరుద్యోగులు, యువత, ప్రజాస్వామికల వాదులు పాల్గొని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దూది శ్రీకాంత్ రెడ్డి, సొప్పదండి విద్యాసాగర్, కొత్త పల్లి వేణుగోపాల్, మోహన్ రెడ్డి, ఉపేందర్ రావు, బైరి శంకర్, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed