దిశ కథనానికి చలించిన జడ్జి దుర్గ ప్రసాద్.. రెండు రోజులు ప్రత్యక్ష పర్యవేక్షణ

by Web Desk |
దిశ కథనానికి చలించిన జడ్జి దుర్గ ప్రసాద్.. రెండు రోజులు ప్రత్యక్ష పర్యవేక్షణ
X

దిశ, ఝరాసంగం: మాయమై పోతున్నడమ్మా.. మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు.. చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో.. కోటికో.. ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడో కాని.. కంటికి కనరాడు.. అంటూ పిఠాపురానికి చెందిన గురు ప్రసాద్ (75) పై దిశ దినపత్రిక తో పాటు వెబ్ సైట్ లో మంగళవారం మానవీయ కోణంలో ప్రచురితమైన "మంటగలిసిన మానవత్వం" అనే కథనానికి జహీరాబాద్ సివిల్ కోర్టు జడ్జి (మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్) డి దుర్గాప్రసాద్ చలించిపోయారు. కన్న బిడ్డలు అవసాన దశలో ఉన్న తండ్రిని నిర్ధాక్షణ్యంగా వదిలివేయడం హేయ మైనా చర్యగా అభివర్ణించారు. జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుప్రసాద్ ను పరామర్శించారు.

వారి కూతురికి పలుమార్లు ఫోన్ చేసి వాకబు చేశారు. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చివరికి జహీరాబాద్ రూరల్ ఎస్ ఐ శ్రీకాంత్, జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రి సూపర్డెంట్ శేషు బాబు సహకారంతో హైదరాబాద్ సికింద్రాబాద్ లోని" గుడ్ సమారిటన్ ఇండియా" అనే వృద్ధాశ్రమానికి ప్రత్యేక వాహనంలో పంపించారు. ఈ వార్తను మానవీయ కోణంలో ప్రచురించిన దిశ ప్రతినిధికి,యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఇకముందు కూడా మానవీయ కోణంలో ఉన్న వార్తలను కథనాలను ప్రచురిస్తూ అనుక్షణం ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేస్తుందని తెలియజేస్తున్నాం.



Next Story

Most Viewed